: ప్రభుత్వ ఏర్పాటు ఎందుకంటే... ఏడు భాషల్లో చెప్పిన కేజ్రీవాల్
ఢిల్లీ పీఠంపై కూర్చోవడానికి కాంగ్రెస్ పార్టీ మద్దతును తీసుకొన్న అరవింద్ కేజ్రీవాల్.. అలా ఎందుకు చేశారో ప్రజలకు ఏడు భాషల్లో వివరించారు. ఈ మేరకు యూట్యూబ్ లో ఓ వీడియోను విడుదల చేసి.. ఏడు భారతీయ భాషల్లో తమ విధానాన్ని సమర్థించుకొన్నారు. ఈ వీడియోను తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, మరాఠీ, హిందీ, ఇంగ్లిష్ భాషలలో రూపొందించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అమ్ ఆద్మీ పార్టీ నిర్ణయం తీసుకొనేందుకు రెండు రోజుల ముందుగానే ఈ వీడియోని ఆన్ లైన్ లో పెట్టారు. ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ మద్దతు తీసుకోవాలా? వద్దా? అని అడిగినప్పుడు 74 శాతం ప్రజలు సుముఖత వ్యక్తం చేశారని ఏఏపీ నేతలు పేర్కొన్నారు. కాంగ్రెస్ బయట నుంచి మాత్రమే మద్దతు ఇస్తోందని, మంత్రివర్గంలో కాంగ్రెస్ భాగస్వామ్యం ఉండదని కూడా ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.