: 'పద్మశ్రీ' వివాదంపై మోహన్ బాబు స్పందన
'పద్మశ్రీ' వివాదంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సినీ నటుడు మోహన్ బాబు స్పందించారు. తనకు ఇచ్చిన పద్మశ్రీ పురస్కారంపై వచ్చిన వివాదం విషయంలో కోర్టు ఇంకా అలాంటి తీర్పు ఇవ్వలేదన్నారు. తీర్పు పేపర్ ను తాను చూశానని.. కోర్టు ఒకటి చెబితే చానళ్లు మరొకటి వేశాయన్నారు. ప్రయాణం చేసే మార్గంలో ఎత్తు పల్లాలు ఉంటాయని, తన కంఠంలో ప్రాణం ఉండగా తప్పులు చేయనని మోహన్ బాబు పేర్కొన్నారు. భవిష్యత్తులో తనకు పద్మభూషణ్, పద్మవిభూషణ్ లు కూడా వస్తాయన్నారు. తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న తనను కలిసిన విలేకరులతో ఆయన పైవిధంగా తెలిపారు.