: హిందుస్థాన్ జింక్ విక్రయంపై సీబీఐ దర్యాప్తు
ఎన్డీయే హయాంలో ప్రభుత్వ రంగంలోని హిందుస్థాన్ జింక్ ను అనిల్ అగర్వాల్ కు చెందిన వేదాంత గ్రూపునకు విక్రయించడంపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. ఈ డీల్ లో జరిగిన వందలకోట్ల రూపాయల అవకతవకల ఆరోపణలపై అనిల్ సహా హిందుస్థాన్ జింక్, పెట్టుబడుల ఉపసంహరణ శాఖ, మైనింగ్ శాఖ కు చెందిన ఉన్నతాధికారులను విచారించనుంది. పార్లమెంటు ఆమోదం లేకుండా హిందుస్థాన్ జింక్ ను ఎలా విక్రయించారన్న దానిపై దర్యాప్తులో అధికారులు ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.