: మావోయిస్టు నేత ఆర్కే తల్లి మరణం
మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ (ఆర్కే) తల్లి రాజ్యలక్షి ఈ ఉదయం తుదిశ్వాస విడిచింది. కొంతకాలం నుంచి అనారోగ్యం బాధపడుతున్న ఆమె హైదరాబాదు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. బుధవారం ఆరోగ్యం బాగా క్షీణించడంతో రాజ్యలక్షి (80) కన్ను మూశారు. కాగా, సాయంత్రం నాలుగు గంటలకు రాజేంద్రనగర్ లోని కిస్మత్ పుర శ్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు.