: సాధారణ ఎన్నికలకు ముందే తెలంగాణ వస్తుందని భావిస్తున్నా: దిగ్విజయ్


2014 లో జరగబోయే లోక్ సభ ఎన్నికల కంటే ముందే తెలంగాణ రాష్ట్రం వస్తుందని భావిస్తున్నట్లు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ దిగ్విజయ్ సింగ్ తెలిపారు. తెలంగాణపై అన్ని పార్టీలు వెనక్కి వెళ్లినా తాము (కాంగ్రెస్) మాత్రం కట్టుబడి ఉంటామన్నారు. అన్ని పార్టీలు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నాయన్న దిగ్విజయ్ అన్ని పార్టీలు వాగ్దానం కూడా చేశాయన్నారు. కాబట్టి, రాజకీయాలను తెలంగాణతో ముడిపెట్టవద్దని కోరారు. తెలంగాణ అంశాన్ని మేని ఫెస్టోలో పెట్టినప్పుడు సీమాంధ్ర నేతలు అంగీకరించారని డిగ్గీరాజా చెప్పుకొచ్చారు. అందుకని టీ విషయంలో ఎమ్మెల్యేలు అఫిడవిట్లు ఇచ్చే బదులు చర్చలో పాల్గొంటే బాగుంటుందని సూచించారు.

  • Loading...

More Telugu News