: ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం మూన్నాళ్లైనా ఉంటుందా?


ఢిల్లీలో ఇంకా ప్రభుత్వాన్ని ఏర్పాటైనా చేయలేదు.. అప్పుడే ఆమ్ ఆద్మీ పార్టీ దూకుడు ప్రదర్శిస్తోంది. కాంగ్రెస్ బయట నుంచి మద్దతు ఇస్తానని చెప్పడం వల్లే ప్రభుత్వ ఏర్పాటుకు ఆమ్ ఆద్మీ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. కానీ, ఇంకా సర్కారు కొలువు దీరనే లేదు.. అవినీతి కాంగ్రెస్ నేతల భరతం పడతామంటూ ఆమ్ ఆద్మీ పార్టీ హెచ్చరికలు పంపుతోంది. ఆ పార్టీ నేత యోగేంద్ర యాదవ్ మాట్లాడుతూ తమకు కాంగ్రెస్, బీజేపీ సహా ఏ పార్టీతోనూ పొత్తు లేదని.. కాంగ్రెస్ కేవలం బయట నుంచి మద్దతిస్తోందన్నారు. అలా అని అవినీతి కాంగ్రెస్ నేతలను విడిచి పెట్టేది లేదని చెప్పారు. ప్రభుత్వం కూలినా పర్లేదన్నారు. దీన్నిబట్టి చూస్తే ఆమ్ ఆద్మీ పాలన ఎన్ని రోజులుంటుందో? అన్న సందేహాలు ఏర్పడుతున్నాయి.

  • Loading...

More Telugu News