: జానారెడ్డి నివాసంలో టీ కాంగ్రెస్ నేతల భేటీ
పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జానారెడ్డి నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. గుత్తా సుఖేందర్, మంత్రి బస్వరాజు సారయ్య, సబితా ఇంద్రారెడ్డి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ మధ్యాహ్నం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్న నేపథ్యంలో అక్కడ చర్చించే అంశాలపై ముందుగానే ఒకసారి మాట్లాడుకుంటున్నట్లు తెలుస్తోంది.