: గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించిన టీడీపీ ఎమ్మెల్యేలు
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు తొలిరోజు శాసనసభ సమావేశాలను బహిష్కరించారు. గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తుండగా తెలుగుదేశం శాసనసభ్యులు తమ స్థానాల్లోంచి లేచి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. గవర్నర్ అబద్దాలు చెప్పడం వల్లే ఆయన ప్రసంగాన్ని బహిష్కరించామని చెప్పారు. దొంగల ప్రభుత్వాన్ని గవర్నర్ తన ప్రభుత్వంగా చెబుతున్నారని విమర్శించారు.