: మతిమరుపు ఎక్కడ మొదలవుతుందంటే...
మతిమరుపు జబ్బు అల్జీమర్స్ ఎక్కడ మొదలవుతుంది? అనే విషయాన్ని పరిశోధకులు ఇంతకాలంగా గుర్తించలేకుండా ఉండేవారు. కానీ తాజాగా నిర్వహించిన పరిశోధనల్లో శాస్త్రవేత్తలు మెదడులో అల్జీమర్స్ జబ్బు ఎక్కడ మొదలవుతుంది? అనే విషయాన్ని కనుగొన్నారు. కొలంబియా విశ్వవిద్యాలయ వైద్య కేంద్రం (సీయూఎంసీ)కి చెందిన శాస్త్రవేత్తలు జ్ఞాపకశక్తిని కోల్పోయేలా చేసే అల్జీమర్స్ వ్యాధి మూలాన్ని మెదడులో గుర్తించగలిగారు. సుమారు 96 మంది అల్జీమర్స్ రోగుల మెదళ్లను క్రియాత్మక ఎంఆర్‌ఐ విధానంలో పరిశీలించిన శాస్త్రవేత్తలు అల్జీమర్స్ వ్యాధి మెదడులో ఆవిర్భవించే ప్రాంతాన్ని గుర్తించగలిగారు.
తమ పరిశోధనల్లో ఈ వ్యాధి మెదడులో ఎక్కడ ఆవిర్భవిస్తుంది, ఎందుకు అక్కడే మొదలవుతుంది, ఎలా ఇది వ్యాపిస్తుంది? అనే విషయాలను వీరు తెలుసుకోగలిగినట్టు పరిశోధకుల్లో ఒకరైన స్కాట్ స్మాల్ తెలిపారు. తాము తెలుసుకున్న విషయాల వల్ల ఈ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స చేయడానికి అవకాశం ఉంటుందని వీరు చెబుతున్నారు.