: జనవరి 16న ఓటర్ల తుది జాబితా


2014 సాధారణ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తున్నామని ఎన్నికల సంఘం ఉప కమిషనర్ వినోద్ జోషి హైదరాబాదులో తెలిపారు. ఇవాళ్టితో (సోమవారం) ఓటర్ల నమోదుకు గడువు పూర్తయిన నేపథ్యంలో ఆయన జూబ్లీహాలులో మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే నమోదు చేసుకున్న వారి జాబితాను నిన్న (ఆదివారం) నగరంలోని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అందుబాటులో ఉంచామని ఆయన చెప్పారు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకొనేందుకు సోమవారం వరకు గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. జాబితాలో ఒక వ్యక్తికి రెండు చోట్ల పేర్లు ఉంటే.. పరిశీలించి, అలాంటి వాటిని తొలగిస్తామని జోషి తెలిపారు. తుది జాబితాను జనవరి 16వ తేదీన ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News