: ఆ లోటు 'విశ్వరూపం 2' తీరుస్తుంది: కమలహాసన్
ఇటీవల విడుదలైన 'విశ్వరూపం సినిమాలో కొన్ని అంశాలు చూపించలేకపోయామనీ, వాటిని 'విశ్వరూపం-2' లో చూడచ్చనీ ప్రముఖ నటుడు కమలహాసన్ అన్నారు. ప్రేమ సన్నివేశాలను, తల్లీ కొడుకుల మధ్య బంధాలను అందులో చూపించలేకపోయామనీ, ఆ లోటు ఈ సీక్వెల్ తీరుస్తుందనీ ఆయన చెప్పారు.
పైగా, ఈ సీక్వెల్ లో యుద్ధ సన్నివేశాలను బ్రహ్మాండంగా చిత్రీకరిస్తున్నామని కమల్ అన్నారు. 'విశ్వరూపం' తనకు చేదు అనుభవాలు మిగిల్చినా, ఆర్ధికంగా లాభాలు మాత్రం తెచ్చిందని నవ్వుతూ చెప్పారు. ప్రస్తుతం సీక్వెల్ పనిలో తీరిక లేకుండా వున్నానని ఆయన అన్నారు.