: బంగ్లాదేశ్ లో 37 మంది చైనా, తైవాన్ జాతీయుల అరెస్టు
చైనా, తైవాన్ కు చెందిన ముప్పై ఏడు మందిని బంగ్లాదేశ్ రక్షణ దళాలు అదుపులోకి తీసుకున్నాయి. ఢాకా సరిహద్దు వద్ద అక్రమ ఇంటర్నెట్ టెలిఫోన్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు తెలియడంతో వారిని పట్టుకున్నట్లు ఓ అధికారి తెలిపారు. 'వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఆపరేషన్' కింద తక్కువ రేటు అంతర్జాతీయ కాల్స్ ఆఫర్ చేస్తున్నట్లు తెలియడంతో నిన్న రాత్రి (ఆదివారం) ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు.