: ఢిల్లీ ప్రజలను కేజ్రీవాల్ మోసగించారు: బీజేపీ
కాంగ్రెస్ మద్దతుతో ఢిల్లీ గద్దెనెక్కనున్న ఏఏపీపై బీజేపీ విరుచుకుపడింది. అధికారం కోసం కేజ్రీవాల్ తన సిద్ధాంతాలను సైతం వదులుకున్నారని బీజేపీ నేత హర్షవర్ధన్ విమర్శించారు. ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలు తిరస్కరించిన అవినీతి కాంగ్రెస్ తో జత కట్టడమేమిటని ప్రశ్నించారు. అధికారం కోసం కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ప్రజలకు ఏఏపీ ఇచ్చిన హామీలన్నిటినీ ఆ పార్టీ నెరవేర్చాలని హర్షవర్ధన్ డిమాండ్ చేశారు.