: ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్
ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ అవతరించనున్నారు. ఈ మేరకు ఏఏపీ కేజ్రీను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నుకుంది. ఈ రోజు జరిగిన ఏఏపీ కీలక కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం కాంగ్రెస్ మద్దతు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై ప్రజల అభిప్రాయం తీసుకున్నామని... వారంతా ఏఏపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరారని కేజ్రీవాల్ తెలిపారు. కాసేపట్లో లెఫ్టినెంట్ గవర్నర్ ను కలిసి తమ నిర్ణయాన్ని తెలుపుతామని చెప్పారు. కాసేపటి క్రితం ఢిల్లీలో వందలాది ఏఏపీ కార్యకర్తల మధ్య కేజ్రీవాల్ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు.