: నవంబర్ చాలా హాట్ గురూ!
గత మాసం చాలా వేడిమాసం. ఎంత వేడిమాసం అంటే 134 ఏళ్లలో ఎన్నడూ లేనంత వేడి ఆ మాసంలో నమోదయ్యిందట. కాబట్టే నవంబరు మాసాన్ని చాలా వేడిమాసంగా పరిశోధకులు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా నవంబరు మాసంలో అత్యధిక వేడి నమోదయ్యింది. ఈ విషయాన్ని యూఎస్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (ఎస్‌వోఏఏ) రూపొందించిన నివేదికలో పేర్కొన్నారు.
దీని ప్రకారం 20వ శతాబ్దంలో సగటు ఉష్ణోగ్రత 0.78 డిగ్రీల సెల్సియస్ ఉండగా, నవంబరులో 12.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. 134 ఏళ్లలో ప్రపంచ వ్యాప్తంగా ఈ మాసంలో అత్యధిక భూ, సముద్ర ఉష్ణోగ్రతలు నమోదైనట్టు ఈ నివేదిక చెబుతోంది. ఆఫ్రికా, యూరేషియా, దక్షిణ అమెరికా, పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో నవంబరు మాసంలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు ఈ నివేదికలో పేర్కొనబడింది.