: సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేల భేటీ


టీడీఎల్పీ కార్యాలయంలో సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఈ సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతిని కలవనున్న నేపథ్యంలో, ఆయనకు నివేదించాల్సిన అంశాలపై వీరు చర్చిస్తున్నారు. విభజన బిల్లుతో సీమాంధ్ర ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతుందని... బిల్లు మొత్తం తప్పులతడక అని చెప్పాలని నిర్ణయించారు. అంతేకాకుండా వెంటనే ఈ బిల్లును రీకాల్ చేయాలని కోరాలని నిశ్చయించారు. రాష్ట్రపతికి ఇవ్వడానికి ఆరు పేజీల నివేదికను కూడా టీడీపీ నేతలు సిద్ధం చేశారు.

  • Loading...

More Telugu News