: ప్రభుత్వ ఏర్పాటును అత్యధిక ప్రజలు కోరుతున్నారు: కేజ్రీవాల్


అవినీతి ప్రక్షాళనే ఆమ్ ఆద్మీ పార్టీ లక్ష్యమని ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. దేశ రాజధాని ఢిల్లీలో చీపురు పట్టి అవినీతిని ఊడ్చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ఢిల్లీలో ఓ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. హస్తినలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ పూర్తిచేశామన్నారు. సుమారు 7 లక్షల మందిపై అబిప్రాయ సేకరణ జరిపామన్నారు. అత్యధిక శాతం ప్రజలు ఏఏపీ ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారన్నారు. దాంతో ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేజ్రీవాల్ చెప్పకనే చెప్పారు.

  • Loading...

More Telugu News