: ‘స్వామి శరణం’తో మార్మోగిన శబరిమల
శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి అయ్యప్ప భక్తులు పోటెత్తారు. ‘స్వామియే శరణం అయ్యప్ప’.. శరణు ఘోష శబరిమల గిరుల్లో ప్రతిధ్వనిస్తోంది. అయ్యప్ప దర్శనం కోసం శబరిమల నుంచి శరంగుత్తి వరకు సుమారు ఐదు కిలోమీటర్ల వరకు భక్తులు వేచి ఉన్నారు. ఈ నెల 27వ తేదీ రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్వామిని దర్శించుకొనే వీలుంది. అయ్యప్ప ఆలయాన్ని 27న మూసివేయనున్నారు. తిరిగి 31వ తేదీ రాత్రి నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.