: అదరగొట్టే అధరపూత


పెదాల రక్షణకు లిప్‌బామ్‌ను వాడుతుంటారు. అదే లిప్‌బామ్‌ మీరు ఆపదలో ఉన్న సమయంలో మీకు సహాయం చేసేలా ఉంటే... ఆ లిప్‌బామ్‌ అదుర్స్‌ కదూ? ఇలాంటి ఒక కొత్తరకం లిప్‌బామ్‌ మార్కెట్లోకి వచ్చింది. రాత్రిపూట విధులు నిర్వహించి ఇంటికి వచ్చే మగువలు తమ రక్షణకోసం పెప్పర్‌ స్ప్రే వంటివి బ్యాగుల్లో పెట్టుకోవాలని పలువురు నిపుణులు సూచిస్తుంటారు. కానీ లిప్‌స్టిక్‌, లిప్‌బామ్‌ పట్టినంత ఈజీగా ఇవి బ్యాగుల్లో పట్టవు. ఇది మగువలకు పెద్ద సమస్యగా ఉండేది. కానీ ఈ లిప్‌బామ్‌ ఆ సమస్యను చక్కగా తీరుస్తుందట. ఎందుకంటే దీనిపేరే సైరన్‌ లిప్‌బామ్‌.

సైరన్‌ లిప్‌బామ్‌ పేరుకు తగ్గట్టుగానే సైరన్‌ కొడుతుందట. ఇది చూసేందుకు ఒక కీచైన్‌ బంతిలాగా కనిపిస్తుంది. దీన్ని మామూలు సమయాల్లో అయితే చక్కగా లిప్‌బామ్‌గా వాడుకోవచ్చు. అదే ప్రమాదాలు సంభవించిన సమయంలో దీనికున్న కీచైన్‌ను ఒక్కసారి లాగితే చాలు. కొన్ని కిలోమీటర్ల దూరం వరకూ మోగేలా అలారం మోత మోగిస్తుంది. దీంతో వెంటనే మీకు సాయం అందే అవకాశం ఉంది. మరి, ఈ లిప్‌బామ్‌ అధరాలనే కాదు... మిమ్మల్ని కూడా ఇది కాపాడుతుంది కదూ!

  • Loading...

More Telugu News