: హైదరాబాదు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం నుంచి కమిషనర్ వాకౌట్
హైదరాబాదులో ఇవాళ జరిగిన జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. ఈ సమావేశం నుంచి కమిషనర్ వాకౌట్ చేశారు. ఆయనను మిగతా అధికారులు కూడా అనుసరించినట్టు సమాచారం అందింది. కమిషనర్ గా సోమేష్ కుమార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన మొదటి సమావేశం కావడం గమనార్హం. సభ్యుల ప్రవర్తనతో విసిగిపోయిన కమిషనర్ ఏకంగా బయటకు వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. కాగా, సమావేశంలో కొంతమంది సభ్యులు తమతో అమర్యాదగా మాట్లాడారని, అందుకే వాకౌట్ చేశామని అధికారులు వెల్లడించారు.