: ప్రధాని అభ్యర్థిగా జయలలిత.. తీర్మానం చేసిన ఏఐఏడీఎంకే
దేశ రాజకీయాల్లో ప్రధాని అభ్యర్థిగా కొత్త పేరు తెరపైకి వచ్చింది. ఈ మేరకు ఈ రోజు తమిళనాడు ముఖ్యమంత్రి జె.జయలలితను ప్రధాని అభ్యర్థిగా ఎన్నుకొంటూ ఏఐఏడీఎంకే ప్రకటించింది. ఈ మేరకు ఓ తీర్మానం కూడా చేసింది. ఈ సందర్భంగా జయ మాట్లాడుతూ.. పార్టీ క్యాడర్ తమ అభిప్రాయాన్ని తెలిపిందన్నారు. అయితే, ఈ విషయంపై పార్టీ తన అధికారిక స్టాండ్ ను తీర్మానంలో తెలిపిందని, అంతకంటే ఎక్కువ మాట్లాడలేనన్నారు.