: ఏపీఎన్జీవోలకు టీడీపీ మద్దతు: పయ్యావుల


రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి ఏపీఎన్జీవోలు చేస్తున్న ఉద్యమం చరిత్రాత్మకమైందని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ తెలిపారు. ఏపీఎన్జీవోల ఉద్యమానికి టీడీపీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని చెప్పారు. అఖిలపక్షంతో ఏపీఎన్జీవోల భేటీ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో టీబిల్లును వ్యతిరేకించడానికి సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులందరూ కలసి రావాలని కోరారు. పదవుల్లో కొనసాగుతున్న సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రులు వారి మనసులని ఇప్పటికైనా మార్చుకోవాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News