: ఆస్కార్ బరి నుంచి 'ద గుడ్ రోడ్' అవుట్
భారతదేశం నుంచి ఆస్కార్ అవార్డులకు ఎంట్రీ సంపాదించిన గుజరాతీ చిత్రం 'ద గుడ్ రోడ్'... చివరి దాకా బరిలో నిలవలేకపోయింది. 'విదేశీ భాషా చిత్రం' కేటగిరీలో ఎంపికైన చిత్రాల్లో తొమ్మిది చిత్రాలనే తదుపరి ఓటింగ్ కు వెళ్లేందుకు అవార్డుల కమిటీ షార్ట్ లిస్ట్ చేసింది. దాంతో, భారత్ నుంచి ఎంపికైన గుడ్ రోడ్ రేసులో నిలవలేక పోయింది. దర్శకుడు గ్యాన్ కొరియా ఈ చిత్రాన్ని రూపొందించారు.