: ఏపీఎన్జీవో భవన్ లో ప్రారంభమైన అఖిలపక్ష సమావేశం
హైదరాబాదులోని ఏపీఎన్జీవో భవన్ లో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి టీడీపీ నుంచి సుజనా చౌదరి, పయ్యావుల కేశవ్, కొనకళ్ల నారాయణ, కేఈ ప్రభాకర్... కాంగ్రెస్ నుంచి శైలజా నాథ్, సబ్బం హరి, ఉగ్రనరసింహారెడ్డి హాజరయ్యారు. సీపీఎం నుంచి వై.వెంకటేశ్వర్లు, వీరయ్య.. లోక్ సత్తా నుంచి కటారి శ్రీనివాస్, రవి మారుత్ హాజరయ్యారు. ఆశ్చర్యకరమైన రీతిలో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఈ సమావేశానికి హజరయింది. ఆ పార్టీ నుంచి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సమావేశానికి హాజరుకాలేమంటూ నిన్ననే వైఎస్సార్సీపీ లేఖ రాసింది.