: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి. డీలర్ల కమీషన్ పెంచేందుకు రెండు ఇంధనాల మీద లీటర్ కు చెరో పది పైసలు పెంచారు. దీనికితోడు పెరిగిన అంతర్జాతీయ ముడి చమురు ధరల నేపథ్యంలో పెట్రోల్ పై మరో 31 పైసలు పెంచారు. దాంతో, గత అర్ధరాత్రి నుంచి పెట్రోల్ పై లీటర్ కు 41 పైసలు, డీజిల్ పై 10 పైసలు పెరిగింది. పెంచిన ధరలు శుక్రవారం అర్థరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో హైదరాబాదులో పెట్రోల్ పై లీటర్ కు రూ.78.11, డీజిల్ పై రూ.58.62 వసూలు చేస్తున్నారు.