: నేడు రాజకీయ పార్టీలతో ఏపీఎన్జీవోల భేటీ


సమైక్యాంధ్ర ఉద్యమంలో ఈ రోజు అత్యంత కీలకం కాబోతోంది. ఎందుకంటే, సీమాంధ్రలో ఉద్యమ వేడిని రగిలించిన ఏపీఎన్జీవోలు తొలిసారిగా రాజకీయ పక్షాలతో భేటీ కానున్నారు. వ్యూహాత్మకంగా రాజకీయ శక్తులు కూడా ఉద్యమంలో తమ వంతు పాత్ర పోషించేలా, చట్ట సభల్లో తమ వాణిని సమర్థవంతంగా వినిపించేలా చేసేందుకు ఏపీఎన్జీవోలు నడుం బిగించారు. రాష్ట్ర శాసనసభలో బిల్లుపై చర్చ సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాలు, బిల్లు పార్లమెంటుకు వెళ్తే ఉద్యమాన్ని ఎలా ఉధృతం చేయాలి? అనే అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

ఈ మేరకు ఈ రోజు ఏపీఎన్జీవో హోంలో అఖిలపక్షంతో భేటీని ఏర్పాటు చేశారు ఏపీఎన్జీవోలు. ఈ సమావేశానికి కాంగ్రెస్, టీడీపీ, ఎంఐఎం, లోక్ సత్తా, సీపీఎం, వైఎస్సార్సీపీ పార్టీలను ఆహ్వానించారు. అయితే, ఈ భేటీకి హాజరుకామని వైఎస్సార్సీపీ నిన్ననే ఏపీఎన్జీవోలకు లేఖ రాసింది.

  • Loading...

More Telugu News