: గమ్ము నమిలితే దిమ్మ తిరుగుతుందట!


చూయింగ్‌ గమ్‌ నములుతూ... అలా నోటినుండి బుడగలాగా ఊదుతూ సరదాగా చేయడం మనలో చాలామందికి అలవాటు. కానీ అలా చూయింగ్‌ గమ్‌ను నమలడం అంత మంచిది కాదట. అదే పనిగా చూయింగ్‌ గమ్‌ను నమలడం వల్ల అది తర్వాత తలనొప్పికి కారణమవుతుందని పరిశోధకులు నిర్వహించిన తాజా అధ్యయనంలో బయటపడింది.

టెల్‌అవీన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో చూయింగ్‌ గమ్‌ను మోతాదుకు మించి అదేపనిగా నములుతూ ఉండడం ఏమాత్రం మంచిది కాదని తేలింది. ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఇలా చూయింగ్‌ గమ్‌ను నమలడం అనేది తర్వాత వారిలో మైగ్రేన్‌ తలనొప్పికి కారణమవుతుందని పరిశోధకుల అధ్యయనంలో తేలింది. ఇప్పటి వరకూ చూయింగ్‌ గమ్‌ను నమలడం, తలనొప్పికి మధ్య సంబంధంపై పెద్దగా పరిశోధనలు జరగలేదని దీనిపై పరిశోధన నిర్వహించిన పరిశోధకులు చెబుతున్నారు. తాము పలువురు చిన్నారులకు సంబంధించిన వైద్య రికార్డులను విశ్లేషించినపుడు చూయింగ్‌ గమ్‌ నమిలే అలవాటుకు, తలనొప్పికి సంబంధం ఉన్నట్టు రుజువైందని పరిశోధకులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News