: సీమాంధ్ర నేతలపై విజయశాంతి వ్యాఖ్యలు
ఎంపీ విజయశాంతి సీమాంధ్ర ప్రజాప్రతినిధులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బిల్లు శాసనసభలో పెట్టిన అనంతరం వీధి రౌడీల్లా సీమాంధ్ర నేతలు ప్రవర్తించారన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లు ప్రతులను చింపి రాద్దాంతం చేయడం సరికాదని మెదక్ జిల్లాలోని నంగునూరులో విలేకరుల సమావేశంలో ఆమె అన్నారు. సీమాంధ్రులు తలకిందులుగా తపస్సు చేసినా తెలంగాణ ఆగదన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించేసిందన్న రాములమ్మ, కొత్త సంవత్సరంలో రాష్ట్ర ఏర్పాటు ఖాయమన్నారు.