: అపోహలొద్దు.. విభజన జరిగిపోయింది: దానం
రాష్ట్ర విభజన ఎప్పుడో జరిగిపోయిందని.. విభజనపై ఎవరూ అయోమయం చెందాల్సిన అవసరం లేదని మంత్రి దానం నాగేందర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో మంత్రులు దానం, ముఖేష్ గౌడ్ భేటీ అయ్యారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. అధిష్ఠానం నిర్ణయాన్ని తాము శిరసావహిస్తామని ఈ సందర్భంగా దానం తెలిపారు. హైదరాబాద్ పై శాంతి భద్రతలు గవర్నర్ పరిధిలో ఉంటే సమస్యలు వస్తాయని అన్నారు.