: సోనియా దిష్టి బొమ్మలు దగ్ధం
రాష్ట్ర విభజన ప్రక్రియను ఎలాగైనా పూర్తిచేయాలన్న పట్టుదలతో ఉన్న సోనియాగాంధీపై సీమాంధ్రులలో ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సీమాంధ్ర వ్యాప్తంగా బీజేపీ, ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలు... కేంద్రప్రభుత్వానికి, సోనియాకు వ్యతిరేకంగా పలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చిత్తూరు జిల్లా పీలేరు, మదనపల్లిలో కేంద్ర ప్రభుత్వం దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. అనంతపురం జిల్లాలో హిందూపురం, అనంతపురం, గుంతకల్, ధర్మవరంలలో బీజేపీ శ్రేణులు మహా ధర్నాను చేపట్టి సోనియాగాంధీ దిష్టి బొమ్మను దగ్ధం చేశాయి. అలాగే, రాజమండ్రిలో బిల్లు ప్రతులను చించివేసి సోనియా, జైరామ్ రమేష్ ల దిష్టిబొమ్మలను తగలబెట్టారు.