: మోడీని నోరారా ప్రశంసించిన కరుణానిధి.. పొత్తుకు సూచనా?


రాజకీయ కురువృద్ధుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి నోట మోడీపై ప్రశంసల జల్లు కురిసింది. మోడీ చక్కటి వ్యక్తి అంటూ కరుణ పొగిడారు. తన రాష్ట్రాభివృద్ధి పట్ల మోడీ ఎంతో శ్రద్ధ తీసుకుంటారని చెప్పారు. 'పాలకుడిగా తన శక్తి సామర్థ్యాలను నిరూపించుకున్నారు. అక్కడి ప్రజలు ఆయనను మళ్లీ మళ్లీ ఎన్నుకున్నారు' అంటూ మోడీపై అభినందనలు కురిపించారు.

రెండు సార్లు కేంద్రంలో యూపీఏ సర్కారు కొలువుదీరడానికి కీలకమైన వారిలో ఒకరైన కరుణానిధి, బీజేపీని వ్యతిరేకించే ఆ పెద్దాయన ఉన్నట్లుండి మోడీ జపం చేయడమేంటప్పా? అని కాంగ్రెస్ విస్తుపోతే.. వామపక్షాలు మాత్రం ఊహించిందేనని చెప్పాయి. బీజేపీ మాత్రం కరుణ వ్యాఖ్యలను అభినందించింది. కానీ, 2జీ స్కాములో డీఎంకే ఎంపీల పాత్ర ఉండడంతో ఆ పార్టీ విషయంలో జాగ్రత్తగా ఉండాలనే భావనలో ఉంది. రానున్న ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని డీఎంకే ఇప్పటికే నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఎన్నికల తర్వాత బీజేపీకి దగ్గరయ్యే వ్యూహంలో భాగంగానే కరుణ ఈ వ్యాఖ్యలు చేశారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

  • Loading...

More Telugu News