: ఆర్టీసీలో సమ్మె సైరన్


ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన ఎంప్లాయీస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ సంఘ్ లు సమ్మె బాట పట్టనున్నాయి. ఈ మేరకు ఈ ఉదయం 11 గంటలకు యూనియన్ నేతలు ఆర్టీసీ ఎండీ పూర్ణచందర్ రావును కలిసి, సమ్మె నోటీసును ఇవ్వనున్నారు. సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సర్వీసుల క్రమబద్ధీకరణ, ఉద్యోగులకు మధ్యంతర భృతి చెల్లించాలని ఈ రెండు కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

  • Loading...

More Telugu News