: అత్యాచార నిరోధ బిల్లుపై మార్చి 18న అఖిల పక్షం


అత్యాచార నిరోధ బిల్లును పార్లమెంటులో ఈనెల 22 లోపల ప్రవేశపెడతామని కేంద్ర న్యాయశాఖ మంత్రి అశ్విన్ కుమార్ పేర్కొన్నారు. అయితే, ఈ బిల్లుపై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ముందుగా అఖిల పక్ష సమావేశం నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్ నాథ్ మార్చి 18న అఖిలపక్షం ఉంటుందని వెల్లడించారు. 

కొన్ని సాంకేతిక పదాల నిర్వచనం, కొత్త నిబంధనల్లో లొసుగులు వంటి విషయాల్లో అన్ని పార్టీల్లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కాగా, అఖిల పక్షం విషయమై మంత్రి కమల్ నాథ్ బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, బీఎస్పీలతో చర్చించారు. 

  • Loading...

More Telugu News