: నేడు ప్రధానితో భేటీ కానున్న అఖిలపక్షం.. ఏకమైన వైరి పక్షాలు
బ్రిజేష్ కుమార్ తీర్పును నిరసిస్తూ, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని న్యాయం చేయాలంటూ... రాష్ట్రానికి చెందిన అఖిలపక్షం ఈ రోజు ప్రధాని మన్మోహన్ ను కలవనుంది. కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం, వైఎస్సార్ కాంగ్రెస్, బీజేపీ, లోక్ సత్తా, ఎంఐఎం పార్టీల ప్రతినిధులతో కూడిన అఖిలపక్షానికి సీఎం కిరణ్ నేతృత్వం వహిస్తున్నారు. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పుతో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని... కర్ణాటకలో ఒక్క ప్రాజెక్టుకే 130 టీఎంసీల నీటిని కేటాయించిందనే విషయాన్ని వీరు ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఏదేమైనప్పటికీ, ఎవరిగోల వారిదే అన్నట్టుగా ప్రవర్తిస్తున్న రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ ఒక్కతాటిపై నిలబడి... కలసి ఢిల్లీ వెళ్లడం ఆనందదాయక పరిణామం.