: ఈ కారుకు పెట్రోలు అవసరం లేదు


కారుకు పెట్రోలు అవసరం లేదు అనుకుంటే డీజలు పోయాల్సి ఉంటుందేమో... అనుకోకండి. అసలు ఈ కారు ఇలాంటి ఇంధనాలను అస్సలు వాడదు. అలాగని కరెంటు బ్యాటరీతో నడుస్తుంది అనుకోకండి. ఇది అలాంటి దానితో కూడా నడవదు. దీనికి ఇంధనం గాలి మాత్రమే. కేవలం గాలితోనే ఈ కారు నడుస్తుందట.

రుమేనియా దేశానికి చెందిన రౌల్‌ ఓయిడా అనే వ్యక్తి ఒక 'బొమ్మ'కారును తయారుచేశాడు. బొమ్మకారు అంటే చిన్న పిల్లలు ఆడుకునే కారు కాదు. ఇది నిజంగా పెద్దవాళ్లు ఎక్కి చక్కగా ప్రయాణించగలిగే కారు. బొమ్మకారు అనగా ఇక్కడ చిన్న పిల్లలు ఆడుకునే లెగో బ్రిక్స్‌ బొమ్మలతో తయారుచేశారు. కాబట్టి దీన్ని బొమ్మకారు అన్నాం. ఈ కారు టైర్లు, చక్రాలు మినహా మిగిలిన భాగాలన్నీ కూడా లెగో బ్రిక్స్‌తో తయారుచేశారు. దీన్ని నడపడానికి వేరే ఇతర ఇంధనాలు ఏమీ అవసరం లేదు. గాలి ఉంటే చాలు. రయ్యిమని గంటకు 30 కిలోమీటర్ల వేగంతో ఇది దూసుకెళుతుందట. ఈ గాలి కారును తయారుచేయడంలో మెల్‌బోర్న్‌కు చెందిన ఒక వ్యాపారవేత్త కూడా పాల్గొన్నారు. ఈ గాలికారును తయారుచేయడానికి వారికి 5 లక్షలకు పైగా లెగోబ్రిక్స్‌ అవసరమయ్యాయట, ఇంకా 37 లక్షల రూపాయలదాకా ఖర్చయ్యాయట. ఏమైతేనేం... ఈ కారు నడపాలంటే దీనికి పెట్రోలు, డీజలు తదితర ఇతర ఇంధనాలు అవసరంలేదు... గాలివుంటే చాలు... రయ్యిమని వెళ్లిపోవచ్చు!

  • Loading...

More Telugu News