: వస్త్ర వ్యాపారుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది: కేసీఆర్


వస్త్ర వ్యాపారులపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన వ్యాట్ పై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కోటిమంది వస్త్ర వ్యాపారుల జీవితాలతో ప్రభుత్వం చెలగాట మాడుతోందని ఆరోపించారు. వ్యాట్ ఎత్తివేయకపోతే ప్రభుత్వానికి ముందు ముందు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ఈ విషయంపై శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. హైదరాబాదులోని ఇందిరాపార్కు వద్ద వ్యాట్ కు నిరసనగా వస్త్ర వ్యాపారులు చేస్తున్న ఆందోళనకు కేసీఆర్ సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. 
కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్లే నేడు ప్రజలకు కష్టాలొచ్చాయని వ్యాఖ్యానించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా వ్యాట్ విధించడం విడ్డూరంగా ఉందన్నారు. అటు విద్యుత్ కోతలు పరిశ్రమలను దెబ్బతీస్తున్నాయన్నారు. ఇలాంటి సమస్యలపై పోరాడేందుకు శాసనసభలో తీర్మానం ప్రవేశపెడుతున్నామని కేసీఆర్ చెప్పారు. 

  • Loading...

More Telugu News