: అందరి చూపు తెలుగుదేశం వైపే: చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ వైపు అందరూ ఆసక్తిగా చూస్తున్నారని.. అలాంటి వారిలో మంచి వారిని గుర్తించి, పార్టీలోకి తీసుకురావాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. ఇవాళ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. 2014 ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా పనిచేయాలని, అందుకు కార్యకర్తలను సమాయత్తం చేయాల్సిన బాధ్యత తీసుకోవాలని వారికి సూచించారు. ప్రతి జిల్లాలో పర్యటించి కార్యకర్తలతో సమీక్షా సమావేశం జరుపుతానని ఆయన వెల్లడించారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చించేందుకు జనవరి 23 వరకు సమయం ఉన్నందున... సమస్త సమాచారం సేకరించి శాసనసభా సమావేశాలకు సిద్ధం కావాలని చంద్రబాబు చెప్పారు.