: బిల్లులో ప్రతి పేజీ తప్పుల తడకే: పయ్యావుల


రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు మొత్తం తప్పులతో నిండిపోయిందని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ అన్నారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, ఏ ఎమ్మెల్సీ ఏ రాష్ట్రంలో ఉండాలనే దానిపై స్పష్టత లేదని అన్నారు. అలాగే బిల్లులో అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్సీల పేర్లు లేవని సూచించారు. కేంద్రం రాష్ట్ర విభజన బిల్లు ఎంత నిర్లక్ష్యంగా తయారుచేసిందో రాష్ట్రపతికి వివరిస్తామని పయ్యావుల తెలిపారు. బిల్లులో ప్రతిపేజీ తప్పుల తడకేనని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News