: మహేష్ బాబు, సుకుమార్, డీఎస్పీ అంటేనే ఫుల్ ఎనర్జీ: బోయపాటి శ్రీను
మహేష్ బాబు, సుకుమార్, దేవీశ్రీప్రసాద్ (డిఎస్పీ)ల కలయిక అంటేనే ఫుల్ ఎనర్జీ అని ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను అన్నారు. '1-నేనొక్కడినే' సినిమాలోని అన్ని అంశాలు అలరిస్తాయన్న బోయపాటి... మహేష్, సూపర్ స్టార్ కృష్ణ అభిమానుల కోరికలన్నింటినీ ఈ సినిమా తీరుస్తుందని చెప్పారు. ఈ సినిమా పాటలు విన్నానని, ఫుల్ జోష్ తో అదిరిపోయాయని అన్నారు. '1' సినిమా ఆడియో వేడుకలో ఈయన పాల్గొంటున్నారు.