: మహేష్ బాబు డాన్సులు అదరగొట్టాడు: ప్రేమ్ రక్షిత్


'1-నేనొక్కడినే' సినిమాలో మహేష్ బాబు చేసిన డ్యాన్సులన్నీ అభిమానులను అలరిస్తాయని కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ అన్నారు. సినిమాలోని ఐదు పాటలకు తానే కొరియోగ్రఫీ చేశానన్న ప్రేమ్ రక్షిత్... సిక్స్ ప్యాక్ చేయడం వల్ల వచ్చే మొరటుదనం మహేష్ బాబులో రాలేదని... ఆయన స్వేచ్ఛగా, స్టైల్ గా అద్భుతంగా డ్యాన్సులు చేశారని కితాబిచ్చారు. సినిమాలో రాక్ స్టార్ గా మహేష్ బాబు మరింత అందంగా కనిపించారని ఆయన అన్నారు. అభిమానులకు '1-నేనొక్కడినే' సినిమా పసందైన విందేనని అన్నారు.

  • Loading...

More Telugu News