: ముఖ్యమంత్రి సీమాంధ్ర పక్షపాతి: రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సీమాంధ్ర పక్షపాతిగా మారారని టీడీపీ నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లుపై శాసన సభలో చర్చ జరగడం కష్టమేనని అన్నారు. ఇప్పటి వరకు జరిగిన సమావేశాలను క్రోడీకరించి... దానికి సంబంధించిన నివేదికను స్పీకర్ మూడు రోజుల్లో రాష్ట్రపతికి పంపించాలని ఆయన డిమాండ్ చేశారు.