: శంషాబాద్ ఎయిర్ పోర్టును పేల్చేస్తామని అమెరికా నుంచి ఫోన్
శంషాబాద్ విమానాశ్రయానికి అర్ధరాత్రి ఒంటిగంటకు ఓ ఆగంతుకుడు ఫోన్ చేసి ఎయిర్ పోర్టును పేల్చేస్తున్నామని హెచ్చరించాడు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది డాగ్ స్క్వాడ్ ను రప్పించి క్షణ్ణంగా తనిఖీలు చేశారు. మరో వైపు ఫోన్ కాల్ పై ఆరా తీసిన అధికారులు అది అమెరికా నుంచి వచ్చినట్టు గుర్తించారు. తరువాత సోదాల అనంతరం ఆ కాల్ ఫేక్ ఫోన్ కాల్ గా గుర్తించారు.