: సచిన్ స్థానానికి న్యాయం చేసిన విరాట్ కోహ్లీ


సచిన్ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు? అంటూ రేగిన సందేహాలకు మరోసారి విరాట్ సమాధానం చెప్పాడు. వన్డేల్లో సచిన్ స్థానానికి న్యాయం చేసిన విరాట్ టెస్టుల్లో కూడా మాస్టర్ స్థానాన్ని భర్తీ చేయగలనని నిరూపించాడు. జొహాన్నెస్ బర్గ్ లో బౌలింగ్ కు అనుకూలించే పిచ్ పై టీమిండియా నామమాత్రపు స్కోరుకే చేతులెత్తేస్తుందని వన్డే సిరీస్ చూసిన ప్రతి ఒక్కరూ భావించారు. కానీ మొక్కవోని పట్టుదలతో విరాట్ కోహ్లీ సెంచరీ సాధించి సచిన్ స్థానంలో తనను పంపించడం సరైన నిర్ణయమేనని చాటాడు. ఆరంభంలో తడబడ్డ భారత జట్టును పుజారా(25), రోహిత్, రహానేతో కలసి కోహ్లీ ఆదుకున్నాడు.

స్టెయిన్ విసిరిన షార్ట్ పిచ్ బంతులను ఆడడంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డ విజయ్(6), ధావన్(13), రోహిత్(14) లు తొందరగానే పెవిలియన్ బాటపట్టినా.. సఫారీల బౌలింగ్ దాడిని ఏమాత్రం బెరుకులేకుండా ఆడిన పుజారా నిలదొక్కుకునేందుకు ప్రాధాన్యమివ్వగా, కోహ్లీ మాత్రం ఎదురు దాడికి దిగి అలవోకగా సెంచరీ సాధించాడు. అనంతరం సంయమనం కోల్పోయిన కోహ్లీ 119 పరుగుల వద్ద వెనుదిరగగా రహానే(43)కు జతగా ధోనీ(17) ఆడుతున్నాడు. దీంతో తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News