: పోలీసులతో చెప్పులు మోయించి, కాళ్లు కడిగించుకున్న లాలూ
జైలుకు పోయి వచ్చినా లాలూ స్టైల్ మాత్రం మారలేదు. లేటెస్ట్ గా ఓ పోలీసుతో చెప్పులు మోయించి, మరో డీఎస్పీ స్థాయి అధికారితో ఏకంగా కాళ్లు కడిగించుకుని... మరోసారి పతాక శీర్షికలకెక్కాడు లాలూ ప్రసాద్ యాదవ్. బిర్సా ముండా జైలు నుంచి విడుదలైన తర్వాత, రామ్ ఘర్ లోని రాజ్రప్పా ఆలయంలో ఆయన పూజలు నిర్వహించారు. ఈ సందర్భంలో ఓ పోలీసు లాలూ చెప్పులను పట్టుకున్నాడు... ఓ డీఎస్పీ ఏకంగా మగ్గుతో నీళ్లు పోసి ఆయన కాళ్లు కడిగాడు.
వీటికి సంబంధించిన ఫొటోలు పత్రికల్లో రావడంతో ప్రతిపక్షాలు అగ్గిమీద గుగ్గిలం అయ్యాయి. దీనిపై స్పందించిన లాలూ, "నా టైమ్ బాగాలేదు.. ఏది జరిగినా వివాదాస్పదమే అవుతోంది" అన్నారు. కాళ్లు కడిగిన డీఎస్పీ మాత్రం లాలూది, తనది ఒకే ఊరని.. చిన్నప్పటి నుంచి ఆయనతో మంచి అనుబంధం ఉందని.. అందుకే ఈ పని చేశానని.. ఇందులో తప్పుపట్టాల్సింది ఏమీ లేదని చెప్పుకొచ్చాడు. జరిగిన ఘటనపై ప్రభుత్వం పోలీసు విచారణకు ఆదేశించింది.