: బిల్లులో తేడా ఉంది.. రాష్ట్రపతికి ఫిర్యాదు: దేవినేని ఉమ
తెలంగాణ బిల్లుపై టీడీపీ ఎమ్మెల్యే దేవినేని ఉమ సందేహాలు లేవనెత్తారు. అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. తెలంగాణ బిల్లు ఆంగ్లంలో ఒకలా, తెలుగులో మరొకలా ఉందని చెప్పారు. బిల్లును స్పీకర్, సీఎంకు కావాల్సిన విధంగా రూపొందించి సభను తప్పుదోవ పట్టించారని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. బిల్లు ఇలా ఉంటే తామెలా చర్చించగలమని ప్రశ్నించారు. దీనిపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని ఉమ చెప్పారు.