: అన్నింటినీ గుటకాయ స్వాహా చేస్తాయి


ఏదైనా సరే... చక్కగా తినడానికి మెత్తగా ఉంటే చాలు... చల్లగా లాగించేస్తాయి. మన ఇళ్లలో ఎక్కువగా కనిపించే వాటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సినవి సాలీళ్లు. ఇవి అందంగా గూడు కట్టుకుని తమ గూటిలో చిక్కుకున్న కీటకాలను గుటకాయ స్వాహా చేస్తుంటాయి. ఇప్పటి వరకూ మనకు సాలీళ్లు కేవలం మాంసాహారమే తింటాయని తెలుసు. కానీ కొన్నిరకాల సాలీళ్లు మాంసాహారమేకాదు... పూల పుప్పొడిని కూడా ఆహారంతోబాటు స్వీకరించేస్తాయని తాజాగా పరిశోధకులు గుర్తించారు.

ఎక్కెటర్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఒక పరిశోధనలో సాలీళ్లు తమ ఆహారంలో పావువంతు పుప్పొడిని కూడా తీసుకుంటున్నట్టు గుర్తించారు. ఈ పరిశోధన గురించి డాక్టర్‌ డిర్క్‌ సాండర్స్‌ మాట్లాడుతూ సాలీడు గూడు కేవలం కీటకాలను బంధించడానికే కాదని, ఇది గాలిలో తేలే పుప్పొడి, ఫంగస్‌ వంటి వాటిని పట్టుకోవడానికి కూడా ఉపకరిస్తుందని, కీటకాలతోబాటు పుప్పొడిని కూడా సాలీడు తింటుందని తెలిపారు. ముఖ్యంగా ఆర్బ్‌ వెబ్‌ సాలీళ్లు పుప్పొడిని తింటున్నట్టు తమ పరిశోధనలో గుర్తించామని, ఇలా పుప్పొడిని తినడం వల్ల వాటికి అన్ని రకాల పోషకాలు అందటానికి అది తోడ్పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఆర్బ్‌ వెట్‌ సాలీళ్లు ఆహారంలో వృక్ష సంబంధమైనవి పెద్ద మొత్తంలో ఉంటున్నాయని, అందువల్ల వీటిని మాంసాహారులకు బదులు సర్వభక్షకాలుగా వర్గీకరించాల్సిన అవసరం ఉందని సాండర్స్‌ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News