: శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వైభవంగా ఆరుద్ర అభిషేకాలు


చిత్తూరు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీకాళహస్తి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. ఇవాళ స్వామివారి జన్మ నక్షత్రమైన ఆరుద్రను పురస్కరించుకుని ఆలయంలోని మూలవిరాట్ లకు వేడినీళ్లతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఇందుకోసం నాలుగు గంటల పాటు భక్తులకు దర్శనం నిలిపివేశారు. అనంతరం శివకామ సుందరీ సమేత నటరాజ స్వామి శ్రీకాళహస్తి పురవీధుల్లో వైభవంగా విహరించారు. ఈ ఊరేగింపులో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొన్నారు.

  • Loading...

More Telugu News