: అమెరికా క్షమాపణలు చెప్పాలి: చంద్రబాబు
భారత దౌత్యాధికారిణి దేవయాని ఖోబ్రగాడే పట్ల అమెరికా వ్యవహరించిన తీరుపై... ఆ దేశం తక్షణమే భారత దేశానికి క్షమాపణలు చెప్పాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ దేవయాని ఖోబ్రగాడే పట్ల తాము పద్ధతిగానే వ్యవహరించామని అమెరికా అధికారులు చెప్పడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. ఆమె పట్ల అమెరికా వ్యవహరించిన తీరు సరికాదని అభిప్రాయపడ్డారు. మరో వైపు విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ అవలంభిస్తున్న విధానం కూడా సరిగా లేదని చెప్పిన చంద్రబాబు నాయుడు, రాష్ట్రంలో ఎన్నికలు వాయిదా పడాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటోందని మండిపడ్డారు.