: శాసనసభ రేపటికి వాయిదా
రాష్ట్ర శాసనసభ రేపటికి వాయిదా పడింది. ఈ రోజు రెండుసార్లు వాయిదా అనంతరం తిరిగి సభ ప్రారంభం కాగానే, ఇరు ప్రాంత ఎమ్మెల్యేలు ఆందోళనలు కొనసాగించారు. సభలోకి స్పీకర్ అడుగు పెట్టగానే పోడియంను చుట్టుముట్టి నినాదాలతో హోరెత్తించారు. స్పీకర్ ఎంత వారించినా ఎవరూ వినిపించుకోలేదు. దీంతో, స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.