: గూగుల్ సెర్చ్ లో టాప్ భారత రాజకీయ నేతలు వీరే..
బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ, కాంగ్రెస్ ప్రధానమంత్రి అభ్యర్థి (ఇంకా ప్రకటించాల్సి ఉంది), రాహుల్ గాంధీ.. వీరి గురించే ఈ ఏడాది ఎక్కువ మంది గూగుల్లో శోధించారు. వీరి తర్వాత కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా, ప్రధాని మన్మోహన్ సింగ్, తమిళనాడు సీఎం జయలలిత, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్, ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేశ్ యాదవ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్, బీజేపీ సీనియర్ నేత, లోక్ సభలో విపక్ష నేతగా ఉన్న సుష్మాస్వరాజ్ వరుసగా పదో స్థానం వరకూ నిలిచారు.